AP TET NOTIFICATION 2022 | AP DSC NOTIFICATION 2022 | AP DSC LATEST NEWS TODAY | AP TET LATEST NEWS TODAY | AP ఉపాద్యాయ బదిలీలకు రంగం సిద్ధం 2022
జూన్ 6 నుండి ఉపాద్యాయ బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది, దానికి ముందు గా మే 28 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ గా ఉన్న స్కూల్ అస్సిస్టెంట్ పదవులకు ప్రమోషన్ లు ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 వేల పోష్టులు ఖాళీ లు ఉన్నా కూడా ఆర్థిక భారం మేరకు ఆర్థిక శాఖ 11,500 పోష్టులకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది, దీని తరువాత జూన్ 6 నుండి ఉపాధ్యాయ బదిలీలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
2020 లో జరిగిన విధంగానే ఉపాద్యాయుల బదిలీలు వెబ్ కౌన్సిలెంగ్ ద్వారా జరుపుతారు, 2015 లో ఉపాద్యాయులకు “వెబ్ కౌన్సిలెంగ్ “నష్టం జరిగింది అనే కోరిక మేరక అప్పటి ప్రభుత్వం 2017 లో సాధారణ బదిలీలు మనువల్ గా జరిపింది. ఇటీవల 2020 లో వెబ్ ను దసరా కు ప్రారంభించి అనేక మార్పులు అనేక ఇబ్బందులతో సంక్రాంతి కి పూర్తి చేసిన ప్రభుత్వం మరో మారు వెబ్ కు శ్రీ కారం చుట్టనుంది. 2020 లో బదిలీ ల ప్రస్థానం కొంత ఆలస్యం అయినా 98% మంది కి పూర్తిగా అనుకూలమైనది గానే భావించారు.
అప్పుడు జరిగిన “కౌన్సిలింగ్” లో వెబ్ ఆప్షన్ “MEO” లాగిన్ లో డిస్ ప్లే కాక రాష్ట్రం లో 13 మంది ఇబ్బంది పడినట్టు గా తెలిసింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా 312 మంది ఉపాధ్యాయులు తమరు మునిసిపల్ ప్రాంతం కు చెందిన వారుగా కోర్టు ను ఆశ్రయించడం తో ప్రభుత్వానికి కొంత మేర ఇబ్బంది వచ్చింది. ఇటువంటివి మరల పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
MERGING పాఠశాలల విషయంలో ఒక అడుగు ముందుకు వేసిన విద్యాశాఖ 1 కిలో మీటర్ దూరం లో గల పాఠశాల విద్యార్ధుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసి ఉంది, 8 సం॥ సర్వీసు పూర్తి చేసుకున్న సమీప ప్రాధమిక పాఠశాల లోని ఉపాధ్యాయుల వివరాలను TIS ద్వారా వారిని బదిలీ కోసం ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
మిగిలిన 8 సం లు పూర్తి కాని వారిని క్వలిఫికేషన్ అనుగుణం గా జూనియర్ ను MERGING ప్రాధమిక పాఠశాల లోని 1, 2 తరగతుల కోసం ఉంచనున్నారు. దీని మూలాన్న SGT ఉపాద్యాయుల కొరత ఏర్పడ నుంది. 1 కిలో మీటర్ పరిధి లో గల చాలా ఉన్నత పాఠశాలలో తరగతి గదుల కొరత ఉంది.
ఏది ఏమైన బదిలీ ల ప్రక్రియ ను జూలై 3 లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ లో DSC-2022 ని విడుదల చేస్తారు.
దీని ప్రకారం చూస్తే జూన్ లో AP టెట్ 2022 నోటిఫికేషన్ వచ్చే అవకాశం AP DSC సెప్టెంబర్ లో రాకపోయిన డిసెంబర్ 2022 లో ఐనా వచ్చే అవకాశం కనిపిస్తుంది.
☑️మరిన్ని వార్తలు imp బిట్స్ pdfs మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ ఉంటే మన గ్రూపులో జాయిన్ అవ్వగలరు⬇️
టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి క్లిక్
insta page Follow :- instagram Click here