Teachers Eligibility Test: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వేలిడిటీ పెంచిన కేంద్ర ప్రభుత్వం
1.టెట్ క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ వేలిడిటీని ఏడేళ్ల నుంచి లైఫ్‌టైమ్‌కు పెంచింది కేంద్ర ప్రభుత్వం.
2.టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-TET క్వాలిఫై అయితే ఆ సర్టిఫికెట్ వేలిడిటీ ఇప్పటివరకు ఏడేళ్లు మాత్రమే ఉంది. కానీ టెట్ సర్టిఫికెట్ వేలిడిటీని లైఫ్‌టైమ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికెట్ జీవితాంతం పనిచేస్తుంది.
3.2011 నుంచి టెట్ క్వాలిఫై అయినవారందరీ సర్టిఫికెట్ వేలిడిటీని ఏడేళ్ల నుంచి లైఫ్‌టైమ్‌కు పొడిగించినట్టు ప్రకటించారు.
4. టెట్ క్వాలిఫై అయి ఏడేళ్లు దాటినవారు, టెట్ సర్టిఫికెట్ ల్యాప్స్ అయినవారికి రీవ్యాలిడేట్ చేసి కొత్తగా టెట్ సర్టిఫికెట్లు జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది
5. ప్రభుత్వ స్కూళ్లల్లో ఉపాధ్యాయ పోస్టులు కోరుకునేవారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వేలిడిటీ-TET క్వాలిఫై కావడం తప్పనిసరి. టెట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని, టెట్ సర్టిఫికెట్ వేలిడిటీ ఏడేళ్లు అని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE 2011 ఫిబ్రవరి 11న గైడ్‌లైన్స్ ప్రకటించింది.
6. టెట్ పరీక్షను రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షను సీటెట్ అని పిలుస్తారు. ప్రతీ ఏటా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-CTET నిర్వహిస్తోంది.
AP TET SYLLABUS 2021 CLICK HERE
TS TET SYLLABUS 2021 CLICK HERE
AP 1TO10th TEXT BOOKS DOWNLOAD PDFS CLICK HERE
TS 1TO10th TEXT BOOKS DOWNLOAD PDFS CLICK HERE
☑️మరిన్ని వార్తలు imp బిట్స్ pdfs మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ ఉంటే మన గ్రూపులో జాయిన్ అవ్వగలరు⬇️
టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి Click Here
insta page Follow :- instagram Click here